Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

– ముఖ్య ప్రణాళిక నోడల్ అధికారి బాబు నాయక్
నవతెలంగాణ – రాయపోల్ 

సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి ఇంటికి చేరడమే ప్రభుత్వ లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేయాలని ముఖ్య ప్రణాళిక నోడల్ అధికారి బాబు నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ఐ కుంచం మానస, ఏఎంసి చైర్మన్ గొల్లపల్లి కనకయ్య అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజాప్రతినిధులు అధికారులతో మండల స్థాయి సమావేశం నిర్వహించారు.

ముందుగా అన్ని శాఖల మండల స్థాయి అధికారులు శాఖల వారిగా నివేదికలను, వారు అందిస్తున్న సేవలు నిర్వహిస్తున్న విధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిష్టాత్మకంగా విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు, మైనర్లు వాహనాలు నడుపుతే తల్లిదండ్రులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, సన్నరకం వరి బోనస్, చేయూత పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి బ్యాంక్ లింకేజ్ వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలను అమలు చేస్తుందని అలాగే విద్యార్థులకు పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం, కుటుంబ జీవిత బీమా, వికలాంగ విద్యార్థులకు వాహనాలు, పంటల మార్పిడి సేంద్రియ వ్యవసాయం వంటి పథకాలను రాబోయే రోజులలో అమలు చేయడం జరుగుతుందన్నారు.

వీటి గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేటట్టు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాయపోల్ మండలం అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రాజేశం, మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, వ్యవసాయ అధికారి నరేష్, ఏపీఎం యాదగిరి, సీనియర్ అసిస్టెంట్లు నాగరాజు, ముత్తాలిఫ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ షబానా, ఎంపీఓ  శివకుమార్, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, లైన్మెన్ శ్రీనివాస్, సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు, సిసిలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -