Friday, April 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా యుద్ధ నౌకల్లో సైనికుల ఆకలి కేకలు

అమెరికా యుద్ధ నౌకల్లో సైనికుల ఆకలి కేకలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యంగా చెప్పుకునే అమెరికా.. ప్రస్తుతం తన సైనికులకు కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితుల్లో చిక్కుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్, యూఎస్ఎస్ ట్రిపోలీ వంటి భారీ యుద్ధనౌకల్లో ఆహార సంక్షోభం తలెత్తిందని, సరిపడా ఆహారం అందక వేలాది మంది సైనికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఈ నౌకల్లోని సైనికులకు అరకొరగా భోజనం అందుతోందని, ట్రేలు దాదాపు ఖాళీగా ఉంటున్నాయని నివేదికలు వస్తున్నాయి. తాజా పండ్లు, కూరగాయల సరఫరా నిలిచిపోవడంతో, కేవలం ఉడికించిన క్యారెట్లు, ప్రాసెస్ చేసిన మాంసంతోనే వారు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ దుస్థితికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో సైనికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కుతూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -