నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్‌లో 19లో భాగంగా బెంగళూరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలేంజర్స్ బెంగళూరు జట్టు తడబడింది. నిర్ణిత 20 ఓవర్లకు ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 200పైగా స్కోరు చేస్తు వస్తుంది. కాని ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు ఆర్సిబీ బ్యాటర్లను కట్టడి చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు ఓపెనర్ సాల్ట్ (63) ఒక్కడే విజృంభించగా మిగత బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీంతో 175 పరుగులు మత్రమే చేయగలిగింది.
ఢిల్లీ బౌలర్లలో ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, ఆక్సర్ పటెల్ రెండేసి వికెట్లు తీయగా ముకెష్ కుమార్ ఒక వికెట్ తీశాడు.



