Sunday, April 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఒకే ప్రయత్నంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

ఒకే ప్రయత్నంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గద్వాల జిల్లా ఉండవెల్లి మండ‌లం బొంకూరుకు చెందిన ఉన్నతి అనే యువతి ఒకే ప్రయత్నంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న ఉన్నతి బీటెక్ పూర్తి చేసింది. ఐబీపీఎస్‌ పరీక్షల ద్వారా కెనరా బ్యాంక్ పీవో, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీవో, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉద్యోగాలు సంపాదించింది. అలాగే ఎస్‌ఎస్‌సీజీఎల్‌ పరీక్షలో జీఎస్టీ అండ్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈ నాలుగింటిలో జీఎస్టీ అండ్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టును ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -