Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ సీజన్లకి మించి..

ఆ సీజన్లకి మించి..

- Advertisement -

ఆహా ఓటీటీ సూపర్ హిట్ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 లాంచ్‌ ఈవెంట్ సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ, డైరెక్టర్ నందినీ రెడ్డి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు.ఫన్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగే సీజన్ 6 సరదా మాటలతో రుచికరమైన వంటలతో వ్యూయర్స్ లో జోష్ నింపబోతోంది. ఈ నెల 10వ తేదీ రాత్రి 7 గంటలకు ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు, ఆహాలో ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ సబ్ స్క్రైబర్స్ కు అందు బాటులో ఉండనుంది. ఆహా ఓటీటీ అధికార ప్రతినిధి కవిత మాట్లాడుతూ,‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు. సక్సెస్ ఫుల్ గా ఆరో సీజన్ కు చేరుకోవడం హ్యాపీగా ఉంది’ అని అన్నారు. షో క్రియేటర్ నితిన్ మాట్లాడుతూ,‘సుమ, నందినీ, ఆహా లేకుంటే ఈ షో ఇంత బాగా వచ్చేది కాదు. పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పారు. ‘ఈ షో ద్వారా అందరికీ మంచి ఫుడ్ చూపిస్తాం, మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తామని చెబుతున్నాం’ అని షో క్రియేటర్ భరత్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -