Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుక్లీన్‌ ఫ్యామిలీ సినిమా

క్లీన్‌ ఫ్యామిలీ సినిమా

- Advertisement -

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ,‘మనందరిలో ఒకరికి జరిగే లాంటి కథే ఇది. ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మా సినిమా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. శ్రీ మురళీ కార్తికేయ అందించిన మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుంది. మా సినిమాను అందంగా రూపొందించారు డైరెక్టర్ రవి లోకిరెడ్డి. నాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన కిషోర్ కి థ్యాంక్స్’ అని తెలిపారు. ‘ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది. ఒక జంట మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం ఈ మధ్య చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అలా తమ జీవితాల్లోకి వచ్చిన ఓ వ్యక్తిని ఒక జంట ఎలా ఎదుర్కొన్నారు, తమ బంధాన్ని ఎలా నిలబెట్టుకున్నారు అనేది మా చిత్రంలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి’ అని ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల చెప్పారు. డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ,‘యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -