- Advertisement -
- ఎస్ఐ తిరుపతి ఆదేశం
- నవతెలంగాణ-బెజ్జంకి
- మండపాల నిర్వహాకులు వినాయక ప్రతిమలను రాత్రి 10 గంటల్లోపు నిమజ్జనోత్సవం పూర్తి చేయాలని ఎస్ఐ తిరుపతి అదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్ యందు వినాయక నిమజ్జనోత్సవంలో మండలంలోని అయా గ్రామాల్లోని మండపాల నిర్వహాకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్ఐ తిరుపతి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అవగాహన కల్పించారు. మద్యం సేవించడం, అధిక ధ్వని వెలువడించే డీజేలు వినియోగించడంపై ప్రత్యేక దృష్టి సారించామని..నిమజ్జనోత్సవాన్ని ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఐ తిరుపతి సూచించారు.
- Advertisement -



