Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు అందించాలి

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు అందించాలి

- Advertisement -

ఎం.ఏ.ఇక్బాల్, సీపీఐ(ఎం) ఆలేరు పట్టణ కార్యదర్శి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం వెంటనే పూర్తి స్థాయి రక్షణ కిట్లు అందించాలని సీపీఐ(ఎం) ఆలేరు పట్టణ కార్యదర్శి ఎం.ఏ.ఇక్బాల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆలేరు పట్టణంలో  సోమవారం రోజున బ్లీచింగ్ సున్నం మిక్స్ చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి పలువురు పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులకు కనీస రక్షణ పరికరాలు లేకపోవడం బాధాకరమన్నారు.

బ్లీచింగ్ సున్నం, ఇతర రసాయన పదార్థాలతో పనిచేసే సమయంలో మాస్కులు, గ్లౌజులు, కళ్లద్దాలు, రక్షణ దుస్తులు తదితర భద్రతా సామగ్రిని తప్పనిసరిగా అందించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన జరిగినప్పటికీ మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరమన్నారు. కార్మికుల భద్రతను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రక్షణ కిట్లు అందించాలని కోరారు. అంతేకాకుండా రసాయన పదార్థాల వినియోగం, ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులకు శిక్షణ, అవగాహన కల్పించాలని ఇక్బాల్ డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -