- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్ : మండలంలోనీ మల్లూరు గ్రామానికి చెందిన గొల్ల ప్రవీణ్ కుమార్ శనివారం రాత్రి విడుదల అయిన అగ్నివీర్ (ఇండియన్ ఆర్మీ) ఫలితాలలో జనరల్ డ్యూటీ ఉద్యోగంలో ఎంపిక అయ్యాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ప్రవీణ్ ఉద్యోగం సాధించడంతో గ్రామంలోని పెద్దలు ప్రవీణ్ కు అభినందనలు తెలియజేశారు. అజయ్ ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు మల్లూరు గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాడు. మొదటిసారి అగ్నివీర్ ఉద్యోగానికి 2023లో ప్రయత్నం చెయ్యగా… రెండుసార్లు విఫలమయ్యాడు. 2025 లో మరో సారి ప్రయత్నించి ఉద్యోగం సాధించాడు.
- Advertisement -


