Wednesday, September 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టులకు ‘ఏఐ’ శిక్షణ

జర్నలిస్టులకు ‘ఏఐ’ శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ మీడియా అకాడమీలో కృత్రిమ మేధలో (ఏఐ), టూల్స్ , టెక్నిక్స్, వర్క్ షాపు ను తెలంగాణ మీడియా అకాడమీ, డాటా లీడ్స్, గూగుల్ న్యూస్ ఇనిషివేటివ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానళ్లకు చెందిన తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలకు సంబంధించిన జర్నలిస్టులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్ ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు కూడా నిత్య విద్యార్థి లాగా ఉండాలన్నారు. ఏఐ శిక్షణలో భాగంగా ఏఐ టూల్స్ ఉపయోగాలు, ప్రమాదాలు, ఏఐ పద్ధతులు, నియమ నిబంధనలు, ప్రాథమిక అంశాల గురించి విస్తృతంగా వివరించారు. కృత్రిమ మేధ జర్నలిస్టుల వృత్తిలో భాగంగా తప్పనిసరి అయిందన్నారు. చాట్ జీపీటీ, పెర్పెక్లిసిటీ, నోట్ బుక్ ఎల్ ఎం, గూగుల్, జమినై, మిడ్ జర్ని, సోరా, విఇఓ3, తదితర టూల్స్ ని పరిచయం చేసి జర్నలిస్టులు ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఉదాహారణల ద్వారా అవగాహన కలిగించారు. ఏఐ డాటా శిక్షణ లో వినియోగంలో లోపం వల్ల, ప్రామ్టింగ్ ఇంజినీరింగ్ సరిగా చేయకపోవడం వల్ల, ఈ వివక్ష లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఏఐ నైతిక నియమాలు తదితర అంశాలకు లోబడి జర్నలిస్టులు బాధ్యతా యుతంగా కృత్రిమ మేథ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మెన్‌ కే.శ్రీనివాస్ రెడ్డి ,అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -