Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంపార్ల‌మెంట్‌లో అఖిలేశ్ వ‌ర్సెస్ అమిత్ షా

పార్ల‌మెంట్‌లో అఖిలేశ్ వ‌ర్సెస్ అమిత్ షా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: డీలిమిటేష‌న్‌పై పార్ల‌మెంట్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం కేంద్రం ఎందుకు తొంద‌ర‌ప‌డుతుంద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. ముందుగా జ‌న‌గ‌ణ‌న ప్రారంభించాల‌న్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌కు స‌మాజ్‌వాదీ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని, కానీ డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ ద్వారా మ‌హిళా కోటాను ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు అఖిలేశ్ తెలిపారు. ఒక‌వేళ జ‌న‌గ‌ణ‌న జ‌రిగిన త‌ర్వాత మేం కుల గ‌ణ‌న గురించి అడుగుతామ‌ని, అప్పుడు రిజర్వేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని, అందుకే మ‌మ్ముల్ని మీరు మోసం చేస్తున్నార‌ని అఖిలేశ్ ఆరోపించారు.

అయితే అఖిలేశ్ యాద‌వ్ వ్యాఖ్య‌ల‌కు అమిత్ షా కౌంట‌ర్ ఇచ్చారు. దేశంలో జ‌న‌గ‌ణ‌న ప్ర‌క్రియ మొద‌లైంద‌ని అమిత్ షా తెలిపారు. కుల గ‌ణ‌న కూడా చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని, 2027 జ‌నాభా లెక్క‌ల్లో కుల గ‌ణ‌న కూడా ఉంటుంద‌ని మంత్రి పేర్కొన్నారు. జ‌నాభా లెక్క‌ల స‌మ‌యంలో కుల గ‌ణ‌న కూడా జ‌రుగుతంద‌ని స‌భ‌కు హామీ ఇస్తున్నాన‌ని మంత్రి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -