- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి నేతలు తీవ్ర వ్యతిరేకతన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని భారత కూటమి పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. అయితే తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక హరివంశ్ ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
- Advertisement -



