నవతెలంగాణ-మల్హర్ రావు : అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అంబేద్కర్ సంఘము అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ అన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు మండలంలోని కొయ్యూరులో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పోతినేని మహేందర్ రెడ్డి, ఉప్ప సర్పంచ్ లకవత్ సవేందర్, వార్డు మెంబర్ పంతకానీ శశి వర్ధన్, నాయక్ పోడ్ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గుంటి రమేష్, తాజోద్దీన్, తెప్పల రజిత, మమత, విశ్వదీప్తి స్కూల్ ప్రిన్సిపాల్ సుదర్శన్, యూత్ అధ్యక్షుడు లకవత్ రాజేందర్, మాజీ కో ఆప్షన్ మెంబర్ అయూబ్ ఖాన్, కొండ సమ్మయ, వెన్నపురెడ్డి శ్రీనివాస్, పర్వతాల లచ్చన్న, బొమ్మ మల్లారెడ్డి, వేల్పుల రాజేందర్, నిరటి విష్ణు, ఉరవెడ్డి భాస్కర్ భూక్యా నరేష్ నాయక్, తోట రాధ కృష్ణ, సుంకే జయంత్ పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



