Monday, June 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం…

బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం…

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
పాఠశాలల యాజమాన్యం నుండి బెస్ట్ అవైలెబుల్ స్కీమ్ లో  ప్రవేట్ కళాశాలల యజమాన్యానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు  జిల్లా షెడ్యూల్ కులములు అభివృద్ధి అధికారి డీకే వసంతకుమారి శనివారం ఒక ప్రకటనలో  తెలిపారు. జిల్లాలో ఒకటవ తరగతి నుండి 10 వ తరగతులు నడుపుచున్న ప్రైవేటు పాఠశాలలో యస్.సి. విద్యార్దినీ/విద్యార్ధులకు బెస్ట్ అవైలెబుల్ స్కీమ్ క్రింద 2025-26 సంవత్సరమునకు, 1వ తరగతి (డే స్కాలర్) , 5వ తరగతి (రెసిడెన్షియల్) ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేర్చుటకు గాను ఆసక్తిగల పాఠశాలల యాజమాన్యం నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.  ఈ పాఠశాలలు ఈ దిగువ పేర్కొనిన నియమాలకు లోబడి ఉండాలని,  ఈ ధరఖాస్తులు సమర్పించు చివరి మే 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాఠశాల ప్రారంభం నుండి ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలని, గత (5) సంవత్సరముల నుండి 10వ తరగతి యందు 90% పైన ఉత్తీర్ణులు అయి ఉండాలి, అందులో 50% ప్రధమ శ్రేణి యందు ఉత్తీర్ణత కలిగి ఉండాలనారు.  పాఠశాలలో  అన్ని వసతులు కలిగి ఉండాలి, అన్ని మౌళిక సదుపాయాలు కలిగి ఉండాలి (స్కూల్ , హాస్టల్ బిల్డింగ్ మ్యాప్, ఫోటోలు జతపర్చవలెను). పాఠశాలల యాజమాన్యం వారి యొక్క ఫీజుల వివరములతో సమర్పించాలని, పాఠశాలలో పని చేసే బోధనా మరియు బోధనేతర సిబ్బంది నియామకం ప్రభుత్వ నియమావళి ప్రకారం ఉండాలనారు. పాఠశాల సొంత భవనము కలిగి ఉండాలని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -