- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలో ఆటో బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కర్ర గణేష్‌ను దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో పల్సి గ్రామానికి రాగానే డ్రైవర్ నిర్లక్యం, అజాగ్రత, అతివేగంగా నడపడంతో ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కుభీర్ గ్రామానికి చెందిన ఠాగూర్ రంజిత్ సింగ్ కాలుకు, చేతుకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనతో పాటు గాయపడ్డ మరో ఐదుగురిని చికిత్స నిమిత్తం బైంసా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
- Advertisement -



