Thursday, September 17, 2026
E-PAPER
Homeఆటలుమూడో టీ20లో భారత్ భారీ స్కోర్

మూడో టీ20లో భారత్ భారీ స్కోర్

- Advertisement -

నవతెలంగాణ-హైదారాబాద్: అఫ్గనిస్తాన్‌‌తో మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. మొదటగా టాస్ గెలిచిన అఫ్గాన్ బౌలింగ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఒపెనర్లు సంజు, అభిషేక్ శర్మ శుభారంభాన్నించారు. 30 బంతుల్లో (9ఫోర్లు, 11సిక్స్)లతో అభిషేక్ సెంచరీతో కదంతొక్కగా, సంజు అర్ధ సెంచరీతో చెలరేగాడు. 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 150 పరుగులతో పటిష్టస్ధితిలో ఉంది టీమిండియా. ఈక్రమంలోనే సెంచరీ చేసి జోరుమీదున్న అభిషేక్ ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే సంజు కూడా ఔట్ అయ్యాడు.ఓపెనర్ల పెవిలియన్ చేరడంతో టీమిండియా బ్యాటర్ల డీలాపడిపోయారు. తిలక్ వర్మ(2), శివం దూబే(14), ఇషాన్ కిషాన్(10), నితిష్ కుమార్(1) స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరారు. కెప్టెన్ శ్రేయస్సు అయ్యర్(29) అక్షర్ పటేల్ తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. ఆఫ్గాన్ ముందు 221పరుగుల టార్గెట్ ఉంచారు. ఆఫ్గాన్ బౌలర్లు ఓమరాజ్ 2, రషిద్ ఒక వికెట్ తీశారు. టీ20 సిరీస్‌‌ను 2-0తో టీమిండియా ముందంజలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -