అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
వతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రయలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్(బీఎల్‌ఏ) అనుమతించొద్దని రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి అదనపు రాష్ర్ట ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ), ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌ఓ), అదనపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఏఈఆర్‌ఓ)లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇండ్లను గుర్తించడం వరకు మాత్రమే బీఎల్‌ఏల పాత్రను పరిమితం చేయాలని సూచించారు. అనోమలీస్, అన్ మ్యాపింగ్ అంశాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫారమ్ 6, 7, 8లకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. విచారణ సమయంలో ఓటర్లు తమకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించడానికి తగిన సమయాన్ని కల్పించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. నోటీసులు, విచారణ తదితర అంశాల పారదర్శకత కోసం సమాచారాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని పేర్కొన్నారు. వికలాంగులు, వయోవృద్ధులను విచారణ ప్రదేశాలకు భౌతికంగా హాజరు కావాలని ఒత్తిడి చేయకూడదన్నారు. అనర్హులుగా గుర్తించబడిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ అనంతరం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.
నోటీసుల జారీలో బీఎల్ఏలను అనుమతించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



