కాంగ్రెస్ ఎంపీలకు భూములు, ఫామ్‌హౌస్‌లు లేవా… : బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూరాల నీళ్లను రైతులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూరాల నీళ్లు ఇవ్వమని అడిగితే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు నిర్బంధించడం సరైంది కాదన్నారు.
వైఖరి మారకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిందని చెప్పారు. బీసీలకు మంత్రి పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. 22ఏ అంశంలో రైతులు, బీసీలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
తెలంగాణ విభజనను ఇండియా, పాకిస్తాన్‌తో పోల్చినా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదని చెప్పారు. హనీమూన్ లాగా ఇక్కడ ఎంపీలు బస్సులు వేసుకుని తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలకు భూములు, ఫామ్‌హౌస్‌లు లేవా?అని ప్రశ్నించారు.
జెన్ జీ విద్యార్థులు కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని గుర్తు చేశారు. పోలీసులు అతిగా వ్యవహరించొద్దని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు, రైతులను పోలీసులు నిర్బంధించారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. 9తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.
జూరాల నీళ్లివ్వడానికి అభ్యంతరం ఎందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



