- Advertisement -
హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరిం చుకుని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో కోటిలోని నారాయణ సేవా సంస్థాన్ ద్వారా వికలాంగులకు వీల్‌చైర్ల ను పంపిణీ చేశారు. బాబా సాహెబ్ ఆశయా లైన సామాజిక న్యాయం, సమానత్వాన్ని ప్రతి బింబించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. ”అణగారిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే అసలైన నివాళి అని, ఈ సాయం వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది” అని సెంట్రల్ బ్యాంక్ జోనల్ హెడ్ ధరాసింగ్ నాయక్ పేర్కొన్నారు.
- Advertisement -


