క్రిసిల్ రేటింగ్స్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత లు భారత ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారనున్నా యని క్రిసిల్ రేటింగ్స్ హెచ్చరించింది. ముఖ్యంగా భారత్కు వచ్చే మొత్తం రెమిటెన్స్ల్లో మూడో వంతు వాటా ఉన్న గల్ఫ్ దేశాల (జీసీసీ) నుంచి నిధుల ప్రవాహం తగ్గితే అది నేరుగా కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) పెరగడానికి దారితీస్తుందని తద్వారా ఆర్థిక సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. దీనికి తోడు ముడి చమురు ధరలు సుమారు 8-9 శాతం పెరగడం వల్ల దిగుమతి బిల్లు భారమవ్వడమే కాకుండా బాస్మతీ బియ్యం, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక ఎగుమతులపై లాజిస్టిక్ సమస్యలు. సరఫరా గొలుసు అంతరాయాల వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది.
చమురు ధరల పెరుగుదల. ఎగుమతులపై పడుతున్న ఒత్తిడిని అధిగమించేం దుకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను బలోపేతం చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొంది.
భారత్కు తగ్గనున్న రెమిటెన్స్లు
- Advertisement -
- Advertisement -



