నాలుగేండ్ల తర్వాత పునఃప్రారంభం
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా పానగల్ మండలం నిజామాబాద్ గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాల బుధవారం పున:ప్రారంభమైంది. విద్యార్థులు పుస్తకాల బ్యాగులతో తరగతి గదుల్లోకి అడుగుపెట్టడంతో పాఠశాల ప్రాంగణం మళ్లీ సందడిగా మారింది. రాబోయే రోజుల్లో పాఠశాల అభివృద్ధి కోసం సహాయ సహకారం అందిస్తానని మాజీ జెడ్పీటీసీ రవి చెప్పారు. గ్రామంలోని ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరాఠి లక్ష్మి, ఉప సర్పంచ్, వరలక్ష్మి, పాన్‌గల్ ఎంఈఓ ఆనంద్, కేతపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంత రామ్‌రెడ్డి, వార్డు మెంబర్లు బాలస్వామి, జె.రామకృష్ణ, సరోజ, కిట్టు, మాజీ సర్పంచ్, ఆంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మూతపడిన ప్రభుత్వ స్కూల్‌కు మళ్లీ జీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



