నవతెలంగాణ-భీంగల్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం కారేపల్లి గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందని గ్రామ సర్పంచ్ మోతిలాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకాష్ తెలిపారు.
గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేదల సొంతింటి కల నెరవేర్చాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అవకాశం ఇచ్చిందని లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన నిబందనలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ అజయ్, ఉప సర్పంచ్ సుజాత రాజేష్, బాబులాల్ నాయక్, గోవింద్, ప్రేమ్ కుమార్, వెంకటేష్, సంతోష్, చందర్, తదితరులు పాల్గొన్నారు.



