Tuesday, September 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక 

జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 
జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మేడే రాష్ట్రపాల్ జాతీయస్థాయి సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక కాగా ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.

ఈనెల 25 నుండి 27 వరకు ఔరంగాబాద్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తి కనబరిచి రాణించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎంపికైన విద్యార్థులు అభినందించిన వారిలో ఎస్.వి.పి. రాజేంద్ర ప్రసాద్, పిడి కోట యాదగిరి, పి ఈ టి ఎస్. ప్రసాద్, హౌస్ మాస్టర్ పి. చంద్రశేఖర్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ బి కిరణ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -