Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్సీకి వినతి 

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్సీకి వినతి 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు మంగళవారం మండల జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల స్థలాల విషయంలో ప్రభుత్వాలు వెనుకడుగు వేయడం ఆవేదన కలిగించే విషయం అన్నారు. అనేకమార్లు అప్లికేషన్లు ఇచ్చినా కూడా ఫలితం లేకుండా పోయిందని, ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో వెంటనే ఆదేశాలు జారీ చేసి రిపోర్టర్ల కు ఇళ్ల స్థలాలు పంపిణీ మొదలు పెట్టాలని ఎమ్మెల్సీని కోరారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే 143 మండల అధ్యక్షులు వడ్డే రమేష్,రిపోర్టర్లు ప్రకాష్, అబ్దుల్ రజాక్, రఘు,ఏర్పుల శ్రీశైలం,రఘు,అంజి, వెంకటేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -