బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ క్యాజువల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్, క్యాజువల్ ఇతర సిబ్బందికి ఉద్యోగ భద్రత కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఏర్పడిందని బీఎస్‌ఎన్‌ఎల్ కాంట్రాక్ట్ క్యాజువల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి జి సాంబశివరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్‌ఎన్‌ఎల్ కాంట్రాక్ట్ క్యాజువల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ యూనియన్(సీఐటీయూ) సర్కిల్ మూడో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ లు రాష్ట్రంలోని యావత్ కార్మికవర్గానికి, శ్రమజీవులకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. ఇటువంటి ప్రమాదకర చట్టాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత కార్మికవర్గానిదేనని చెప్పారు. .బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆలిండియా సెక్రటరీ జనరల్ అడ్మిషన్ మిత్ర, రాష్ట్ర అధ్యక్షులు జూలపల్లి సంపత్ రావు, రాష్ట్ర కార్యదర్శి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్ మాట్లాడారు. మహాసభలో పలు తీర్మానాలు ఆమోదించారు.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలి. సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని తీర్మానం చేశారు. ప్రతి ఔట్సోర్సింగ్ కార్మికునికి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఈపీఎఫ్ ఎంప్లాయర్ వాటా సక్రమంగాను జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెల ఏడో తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, బీఎస్ఎన్ఎల్‌లో టెక్నికల్‌లో పనిచేస్తున్న ప్రతి ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేసే టెండర్ స్కిల్, సెమిస్కిల్ కింద టెండర్ ఫ్లోటింగ్ చేయాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక..
యూనియన్‌గౌరవాధ్యక్షులుగా జి. సాంబశివరావు, అధ్యక్షులుగా జె. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బి. పరిపూర్ణాచారి, కోశాధికారి పి. శ్రీధర్‌తో పాటు 13 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, 14 మంది కమిటీ సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



