Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅందరికి సమాధానమిద్దాం..

అందరికి సమాధానమిద్దాం..

- Advertisement -


అన్ని ప్రశ్నలకూ జవాబిస్తాం…
అప్పటికీ అభ్యంతరమంటే కోర్టును ఆశ్రయిద్దాం : టీఆర్ఎస్ పేరుపై న్యాయ నిపుణులతో కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుపై ఎన్నికల కమిషన్ వద్ద వ్యక్తమవుతున్న అభ్యంతరాలన్నింటికి సమాధానమివ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ పేరును ఉపయోగించడంపై ఇప్పటికే రెండు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా వాటికి వివరణ పంపించారు. మరోసారి శుక్రవారం టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశమై న్యాయ నిపుణులతో చర్చించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన తెలంగాణ రాజ్య సమితి, అలాగే నాందేడ్ కు చెందిన మరో రాజకీయ పార్టీ వ్యక్తం చేసిన అనుమానాలు, అభ్యంతరాలకు కవిత తరఫున న్యాయవాదులు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. అదే సమయంలో ఒక్కొక్కరుగా ఎవరెవరు ఏయే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశారో చెబితే వాటన్నింటిని ఒక్కొక్కటిగా నివృత్తి చేస్తామని టీఆర్ఎస్ తరపున ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్టు తెలిసింది.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి లేఖ రాసి రెండు, మూడు రోజులవుతుందనీ, దానిపై ఈసీ స్పందన రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసీ స్పందన వచ్చాక ఆ విషయంలో ఏం చేయాలనే దానిపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అప్పటికీ టీఆర్ఎస్ పేరును వాడుకోకుండా అడ్డుపడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్మయానికి వచ్చారు. న్యాయపోరాటానికి వెనుకాడకుండా సాధించుకోవాలని పట్టుదలతో ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో ఒక పార్టీ పేరును పెట్టుకునేందుకు ఉన్న చట్టపరమైన అంశాలపై కవిత న్యాయవాదులతో కూలంకుషంగా చర్చించారు. అయితే, ఇప్పటికే టీఆర్ఎస్ పేరును కాకుండా మరో మూడు పేర్లను సూచించాలని కోరుతూ ఈసీ నోటీస్ పంపించిన విషయాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -