యువ న్యాయవాదులు నిరంతర అధ్యయనంతో రాణించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే సంస్కరణలు అవసరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ తమ తమ పరిధుల్లో బలంగా పనిచేస్తూ సమతుల్యతను పాటించినప్పుడే ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడతాయని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లీగల్ కాంక్లేవ్‌లో వివేక్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబ, ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు సమకాలీన న్యాయ అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాజకీయాలు, మీడియా సహా అనేక రంగాల్లో కాలానుగుణంగా సంస్కరణలు వస్తున్నాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ అవసరమైన సంస్కరణలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం–న్యాయ వ్యవస్థ మధ్య సమతుల్యత అత్యంత కీలకమని పేర్కొన్నారు.స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ వృత్తిలో ఒక అంశాన్ని అనుకూల, ప్రతికూల కోణాల్లో పరిశీలించే అవకాశం ఉంటుందని, తద్వారా సమాజంలోని సమస్యలపై సమగ్ర దృక్పథం ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
న్యాయ వ్యవస్థ బలోపేతానికి సంస్కరణలు అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



