Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా కళాకారులకు స్ఫూర్తి నాగన్న

ప్రజా కళాకారులకు స్ఫూర్తి నాగన్న

- Advertisement -

సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విప్లవ గాయకుడు, సాంస్కృతిక కార్యకర్త, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అరుణోదయ నాగన్న మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. కళను ప్రజా ఉద్యమాలకు ఆయుధంగా మలచి వేలాది మంది ప్రజా కళాకారులకు నాగన్న స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఆయన మృతి ప్రజా పోరాటాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్న ఐదు దశాబ్దాల పాటు ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో పనిచేశారని పేర్కొన్నారు. తన గాత్రంతో, జానపద గీతాలతో, విప్లవ స్ఫూర్తిని నింపే సాహిత్యంతో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. కళను ప్రజా ఉద్యమాలకు ఆయుధంగా మలచి వేలాది మంది కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. నాగన్న మరణం ప్రజా, సాంస్కృతిక ఉద్యమాలకు తీరని లోటని జాన్‌ ‌వెస్లీ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యకర్తలకు సీపీఐ(ఎం) తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -