Tuesday, June 2, 2026
E-PAPER
Homeజాతీయంవిమాన ఇంధన ధరలు భారీగా తగ్గింపు

విమాన ఇంధన ధరలు భారీగా తగ్గింపు

- Advertisement -


న్యూఢిల్లీ : సామాన్యులు ఉపయోగించే పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలను ఓ వైపున పెంచుతున్న మోడీ సర్కార్‌.. మరోవైపు ధనవంతులు ప్రయాణించే విమానయాన రంగంపై భారం పడకుండా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన (ఎటిఎఫ్‌) ధరలను 27 శాతం (కిలోలీటరుకు సుమారు 400 డాలర్లు) తగ్గించడం వల్ల విమానయాన సంస్థలకు భారీ ఊరట ‌కల్పించింది. మే నెలలో కిలోలీటరుకు 1,511 డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఇంధన ధర.. తాజా తగ్గింపునతో 1,100 డాలర్లకు (సుమారు రూ.1,05,000) చేర్చింది.
సాధారణంగా ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో విమాన ఇంధనానికే 40 శాతం ఖర్చవుతుంది. ఇటీవల అంతర్జాతీయ పరిణామాల వల్ల అది ఏకంగా 55-60 శాతానికి పెరిగింది. ఈ భారాన్ని తట్టుకోవడానికి విమానయాన సంస్థలు టికెట్ ధరలపై సర్‌ఛార్జీలు విధించడమే కాకుండా.. ఎయిరిండియా వంటి ప్రముఖ సంస్థలు జూన్-ఆగస్టు మధ్య తమ అంతర్జాతీయ సర్వీసులను 27 శాతం మేర తగ్గించుకున్నాయి. ఏప్రిల్‌లో పెరిగిన ధరల అనంతరం, జూన్ నెలకు గాను చమురు సంస్థలు తీసుకున్న ఈ కీలక నిర్ణయం అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపే సంస్థలకు లబ్ధి చేకూరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -