Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎంవీఐ వెంకన్న మృతి పైవిచారణ ప్రారంభం

ఎంవీఐ వెంకన్న మృతి పైవిచారణ ప్రారంభం

- Advertisement -

ప్రమాదస్థలాన్ని సందర్శించిన
జేటీసీ చంద్రశేఖర్‌‌గౌడ్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా ఎంవీఐ వెంకన్న మృతిపై బుధవారం విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం నియమించిన విచారణాధికారి జేటీసీ చంద్రశేఖర్‌‌గౌడ్‌ ‌సంఘటనా స్థలాన్ని సందర్శించారు . ఈనెల 22 వ తేదీన భూపాల పల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా విచారణ అధికారి చంద్ర శేఖర్ గౌడ్ భూపాలపల్లికి వెళ్లారు. సమగ్ర వివరాలను అధికారులు, స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. తొలుత ఘనపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. సంఘటనకు సబంధించి పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను స్టేషన్ సీఐ కరుణాకర్ రావు, ఎస్ ఐ అశోక్ ను అడిగి తెలుసుకున్నారు.

తర్వాత లారీ డ్రైవర్ ను, లారీ ఓనర్ హార్వెస్టర్ డ్రైవర్ ను విచారించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యి ఆ రోజు లారీలో ఉన్న బొగ్గు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురు ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి సంఘటన జరిగిన పరిస్థితులను అధ్యయనం చేశారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. తర్వాత బొగ్గు లోడింగ్ పాయింట్ అయిన తాడిచర్ల కు వెళ్లి అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రతినిధులతో సమావేశమయ్యి ఆరోజు ఆ లారీ లోడ్ రికార్డులను పరిశీలించారు. విచారణ అధికారి చంద్ర శేఖర్ గౌడ్ వెంట మోటారు వాహన తనిఖీ అధికారులు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్, ఘన్ పూర్ సి ఐ కరుణాకర్ రావ్ , ఎస్ ఐ అశోక్ , భూపాలపల్లి ఏ ఎం వి ఐ లు ఫాహిమా సుల్తానా, సుందర్ లాల్, శ్రీనివాస్ ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో సంఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వివరాలను రవాణా కమిషనర్ కు అందజేయనున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -