కిటికీలోంచి విసిరేయడంతో నవజాత శిశువు మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ మహిళా హాస్టల్‌లో అమానుష ఘటన జరిగింది. హాస్టల్ బాత్రూంలో ఓ యువతి ప్రసవించగా, అనంతరం ఆ పసికందును వాష్‌రూమ్ వెంటిలేటర్ కిటికీలోంచి బయటకు విసిరేసింది. దాంతో నవజాత శిశువు మృతిచెందింది. యువతి ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకెళ్తే.. ఓ హాస్టల్ వాష్‌రూమ్‌లో యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం నవజాత శిశువును బాత్రూం వెంటిలేటర్ నుంచి బయ టకు విసిరేసింది. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం కావడం, ఆరోగ్యం క్షీణించడంతో సదరు యువతిని హాస్టల్ సిబ్బంది నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. సమాచారం అందు కున్న గోల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పసికందు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. సదరు యువతి గర్భవతి అనే విషయం తమకు అస్సలు తెలియ దని, ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పుమూ గమనించలేదని కళా శాల, హాస్టల్ యాజమాన్యం చెబు తోంది. అయితే ఇంత పెద్ద విష యాన్ని హాస్టల్ సిబ్బంది ఎలా గమనించలేకపోయారనే కోణం లోనూ పోలీసులు విచారణ జరుపు తున్నారు. ఆమె తన సొంత బావ కారణంగానే గర్భవతి అయి ఉండొ చ్చని యువతి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ప్రకారం పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
హాస్టల్ బాత్రూంలో యువతి ప్రసవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



