Wednesday, September 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీజీ వైద్య విద్య ఫీజులను తగ్గించాలి

పీజీ వైద్య విద్య ఫీజులను తగ్గించాలి

- Advertisement -


టీఏఎఫ్‌ఆర్‌‌సీకి హెచ్‌ఆర్‌‌డీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రయివేటు మెడికల్ కళాశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ (ఎమ్‌‌డీ, ఎమ్‌ఎస్‌) కన్వీనర్ కోటా (కేటగిరీ–ఏ) సీట్ల ఫీజులను తగ్గించి, హేతుబద్ధీకరించాలని హెల్త్‌‌కేర్‌ ‌రీఫార్మ్స్‌ ‌డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌. ‌కార్తీక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌మహ్మద్‌ అజిత్‌ కోరారు. సోమవారం హైదరాబాద్‌‌లో ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌‌సీ) చైర్మెన్‌ను హెచ్‌ఆర్‌‌డీఏ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. 2023–2026 బ్లాక్‌కు సంబంధించి ప్రయివేటు వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా/కేటగిరీ–ఏ పీజీ సీట్ల ఫీజులను పునఃసమీక్షించాలని వారు కోరారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అమలవుతున్న ఫీజు నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకుని ఫీజులను తగ్గించి, సహేతుకంగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
మెరిట్ ఆధారంగా పీజీ వైద్య సీట్లు పొందే విద్యార్థులకు ఫీజులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అధిక ఫీజుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అర్హత కలిగిన విద్యార్థులు పీజీ వైద్య విద్యకు దూరం కాకుండా చూడాల్సిన అవసరముందని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీజీ వైద్య విద్యలో పారదర్శకమైన, న్యాయసమ్మతమైన, అందుబాటులో ఉండే ఫీజు విధానం అమలు చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -