Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంఎస్ఎఫ్ఐ విజయోత్సవం

ఎస్ఎఫ్ఐ విజయోత్సవం

- Advertisement -

ఎస్ఎఫ్ఐ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలే నిరసనకు ప్రాణం:
సీజేపీ ప్ర‌తినిధి సుధీర్ సంగ్వాన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రధాని మోడీని మోకాళ్లపైకి తెచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించిన జంతర్ మంతర్ నిరసనకు ఎస్ఎఫ్ఐ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలే ప్రాణమని సీజేపీ సహ వ్యవస్థాపకుడు, నటుడు సుధీర్ సంగ్వాన్ అన్నారు. సోమ‌వారం నాడిక్క‌డ హ‌రికిష‌న్ సుర్జిత్ భవన్‌లో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ ఆధ్వ‌ర్యంలో విజయోత్సవ సమావేశం జ‌రిగింది. సీజేపీకి నిర్దిష్టమైన ఎజెండా ఏదీ లేదని, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ వంటి సంఘాలతో సంప్రదించి ప్రతిరోజూ నిరసన తెలిపే పద్ధతిని నిర్ణయిం చుకుందని సంగ్వాన్ అన్నారు.

ఈ ఉద్యమం దేశ చరిత్రలో ఒక కొత్త ఇతిహాసాన్ని లిఖించింది : ఎం.ఏ బేబీ
పేపర్‌ ‌లీకేజీ విషయంలో కేంద్రంపై పోరాటాన్ని ప్రారంభించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌లకు తాను అభినందనలు తెలిపినట్టు ఎం.ఏ బేబీ 
చెప్పారు. ‘‘ఈ విద్యార్థి-యువజన ఉద్యమం దేశ చరిత్రలో ఒక కొత్త ఇతిహాసాన్ని లిఖించింది. 
యువతరం మోడీ 56 అంగుళాల ఛాతీని ఓడించింది. ఈ ఉద్యమంలో వామపక్ష ఎంపీలు 
చురుకుగా జోక్యం చేసుకున్నారు’’ అని బేబీ చెప్పారు. పొలిట్‌‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, మరియం ధావ్లే, రాఘవులు, విజూ కృష్ణన్, కేంద్ర కమిటీ సభ్యులు పికె శ్రీమతి, ఏఆర్ సింధు, 
ఎంపీలు అమ్రా రామ్, కె.రాధాకృష్ణన్, సచ్చితానందం, జాన్ బ్రిట్టాస్, ఏఏ రహీమ్, 
వి. శివదాసన్, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ఎం సాజి, ప్రధాన కార్యదర్శి 
సృజన్‌భట్ట తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలకు 
అభినందన బ్యాడ్జీలు అందజేశారు. విజయోత్సవ వేడుకలో వీడియో ప్రదర్శన, జననాట్య మంచ్ 
నాటకం, ర్యాప్ సంగీతాన్ని ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐతో ఇప్పు డున్న సంబంధం వల్ల అందరినీ పేరు పెట్టి పిలవగ లుగుతున్నామని ఆయన తెలిపారు. ఎన్నో కష్టాలను, త్యాగాలను సహించి ఎస్ఎఫ్ఐ ఈ పోరాటంలో దృఢంగా నిలబడింద‌నీ, తాను మొదట్లో సీజేపీని కూడా అనుమానంతోనే సంప్రదించానని, కానీ ఈ విప్లవంతో ఎల్లప్పుడూ కలిసి నడుస్తానని సంగ్వా న్ అన్నారు. పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన వారికి ఇచ్చే ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ బ్యాడ్జ్‌ను, భగత్ సింగ్‌పై ఒక పుస్తకాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ బేబీ.. సంగ్వాన్‌కు బహూకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -