టెహ్రాన్ : చర్చలను పునఃప్రారంభించాలని తాము అమెరికాను కోరలేదఁ ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై టెహ్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘ఇది యుద్ధ నిర్వహణ కాదు. పదే పదే జరుగుతున్న యుద్ధ నేరాల గురించి గొప్పలు చెప్పుకోవడం వారు సృష్టించుకున్న విపత్తు నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నం మాత్రమే. దీనికి వారు తప్పక మూల్యం చెల్లించుకుంటారు’ అని అన్నారు. ఒమన్‌తో రాజకీయ, సాంకేతిక చర్చలు కొనసాగు తున్నాయని ఆయన తెలిపారు. శుక్ర, శని వారాలలో ఒమన్ బృందం టెహ్రాన్‌లో పర్యటించిందని, చర్చలు పురోగతి సాధించాయని చెప్పారు. కాగా హార్ముజ్ మీదుగా నౌకాయా నాన్ని ఎలా నిర్వహించాలనే విషయంపై ఇరాన్, ఒమన్‌లు చర్చల సందర్భంగా దృష్టి సారించాయి. మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపుకుంటున్నామని, కానీ అమెరి కాతో ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. జలసంధి నిర్వహణకు, నౌకాయా నానికి భద్రత కల్పించడాంకి ప్రాంతీయ కన్సార్టి యంను ఏర్పాటు చేయాలని ఒమన్ ప్రతిపాదించిందఁ తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం హార్ముజ్‌లో ప్రయాణించే నౌకలు ఎలాంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ వ్యతిరేకిస్తోంది. నౌకలు ‘సేవా రుసుము’ను చెల్లించా ల్సిందేనని, ఏ యంత్రాంగమైనా తమ నియం త్రణలోనే ఉండాలని అది పట్టుపడు తోంది. చర్చల్లో పురోగతి కనిపి స్తోందని ఇరాన్ చెబుతున్నప్పటికీ హార్ముజ్‌పై దాఁ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపిం చడం లేదు.
మేము చర్చల కోసంవెంపర్లాడలేదు : ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



