Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాన్యులపై యూపీఐ చార్జీల భారం

సామాన్యులపై యూపీఐ చార్జీల భారం

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
సామాన్య ప్రజలపై యూపీఐ చెల్లింపులపై చార్జీల భారం మోపుతుందని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్  తొర్రూర్ డివిజన్ నాయకులు జక్కుల యాకయ్య, ఇరుగు అనిల్ లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గురువారం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యూపీఐ చెల్లింపులపై చార్జీలకు వ్యతిరేకంగా నిరసనగా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి ,ఆలేరు క్రాస్ రోడ్ ల వద్ద నిరసనలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫోన్ పే,గూగుల్ ప్లే,పేటీఎం చెల్లింపులపై చార్జీల బాదుడు మానుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సామాన్యులపై భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వ వైఖరి నశించాలని  నినాదాలు చేశారు.

కొన్నేళ్లుగా ఉచితంగానే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా మని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం, తాజాగా యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడం దుర్మార్గ పూరితమని మండిపడ్డారు. అమెరికా,వీసా, మాస్టర్ కార్డుల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యకు ఉపక్రమించటం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే మోడీ ప్రభుత్వం ఇలాంటి ప్రజావ్యతిరేక చర్యలను విడనాడాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలపై  భారం వేసే మోడీ ప్రభుత్వ చర్యలను  అన్ని వర్గాల ప్రజలు నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సి.పి.ఐ.(ఎం.ఎల్) మాస్ లైన్ నాయకులు దొడ్డ కేశవులు,  కావటి రమేష్, తోట రవీందర్, ఐలయ్య ,భరత్ ,మధు, బిక్య , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -