నల్లగుట్ట తండా మాజీ సర్పంచ్ భీముడు
నవతెలంగాణ-నెల్లికుదురు
ఎస్టీల గిరిజన ఆదివాసీల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమైందని నల్లగుట్ట తండా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ భీముడు గ్రామ పార్టీ అధ్యక్షుడు జి వెంకన్న తెలిపారు. గురువారం ఆ తండా గ్రామ పంచాయతీలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆదివాసీ సంక్షేమానికి రూ.37వేల కోట్లు ఖర్చు చేసి 6లక్షల మందికి పోడు భూమి పట్టాలు ఇచ్చి ,రైతుబందు, 2లక్ష్యల రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, చెరువుల పూడికలు తీయడం , రైతు బీమా 5 లక్షలు ఇచ్చుకుంటూ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించే విధంగా రూపుదిద్దున వ్యక్తి కెసిఆర్ అని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 500 జనాభా కలిగిన ప్రతి తండా, ఆదివాసీ గూడేన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించారు. మొత్తంగా 1326 తండాలు, 525 గూడెలను పంచాయతీలుగా ప్రకటించారని అన్నారు. తద్వారా ఆయా వర్గాలకు చెందిన వారినే స్వయం పాలకులుగా చేశారు. అభివృద్ధికి బాటలు వేశారు అని తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్ 10% పెంచి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా నల్లగుట్ట తండాలో ఈ సందర్భాన్ని పురస్కరించుకు గిరిజన బంధావుడు తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకాలు చేస్తూ గిరిజనులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని.కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశామని చెప్పారు.కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు జి. వెంకన్న యస్ టి సెల్ అధ్యక్షులు జి హచ్చు,మాజీ వార్డు మెంబెర్ బి.మోహన్, తండా పెద్దమనుషులు బిదేవేందర్, శంకర్,బాలాజీ, మీటు, శక్రు, కోకా లచ్చు,కిషన్.పాల్గొన్నారు.



