నవతెలంగాణ – భీంగల్ : మహిళా సంఘాల్లోని ప్రతి కుటుంబం యొక్క కనీస అవసరాలు గుర్తించి మహిళా సంఘాల సమావేశంలో చర్చించి ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీవో గంగుల సంతో కుమార్ అన్నారు. భీంగల్ ఐకెపి కార్యాలయంలో వివోఏలకు VPRP ప్రణాళిక తయారీ కోసం గ్రామస్థాయిలో ప్రతి కుటుంబ అవసరాన్ని గుర్తించలని, ప్రధాన ప్రణాళికల్లో వర్గీకరించి అత్యంత అవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయాలని సూచించారు. విపిఆర్పి ప్రాణానికి తయారీ ఉద్దేశమని అన్నారు. దీని కొరకు అన్ని శాఖల అధికారులతో అక్టోబర్ రెండు రోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రమీల, ఏపీఓ నరసయ్య, సీసీలు వివోఏలు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబం యొక్క అవసరాలు గుర్తించాలి: భీంగల్ ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -



