- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖ జిల్లాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మల్లా ప్రవీణ్ కుమార్, అతని భార్య, ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల శ్రీశైలంలో ఒక ఫ్యామిలీ ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే.
- Advertisement -



