Thursday, August 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅప్పుల్లో అమెరికా-ట్రంప్ రికార్డుల మోత!

అప్పుల్లో అమెరికా-ట్రంప్ రికార్డుల మోత!

- Advertisement -

అమెరికా అంటే చాలా మందికి గొప్ప! అలాంటి వారందరూ పండగ చేసుకోవాల్సిన మరో “ఘనత”ను అది సాధించింది. డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిలో తొలిసారిగా జీడీపీని మించి మంగళవారం నాడు రికార్డుస్థాయిలో అప్పు నలభై లక్షల కోట్ల డాలర్లను దాటింది. రిపబ్లికన్-డెమోక్రటిక్ పార్టీలు రెండూ దొందూదొందే. వాటి పాలనలో 2016 నుంచి పదేండ్లలో అప్పు రెట్టింపై సామాన్యుల సంక్షేమానికి ప్రమాద ఘంటికలను మోగించింది. దేశ రక్షణ శాఖ బడ్జెట్‌కు మించి అప్పుల అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఎందుకీ పరిస్థితి తలెత్తిందంటే కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు వారికి పన్ను తగ్గింపు రాయితీలు ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. కరోనా సమయంలో తీసుకున్న చర్యల కారణం గా రెండేండ్లలో పెద్ద మొత్తం లో అప్పులు తీసుకోవ టంతో కొండలా పెరిగిందని చెప్ప టం అర్దసత్యమే. ఈ ఏడాది ఐదునెలల్లోనే 39 నుంచి 40లక్షల కోట్లకు పెరిగింది, రెండవ సారి ట్రంప్ అధికారం స్వీకరించిన 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 3.8లక్షల కోట్ల డాలర్ల మేర అప్పు పెరగ్గా, మిగిలిన పాలనా కాలంలో మరో 4.7లక్షల కోట్లు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికి దివాలా కోరు విధానాలు తప్ప చెప్పేందుకు ఎలాంటి సాకు లేదు.

అమెరికా చరిత్రలో తొలిసారిగా నెలవారీ లోటు జూలై నెలలో 432 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వచ్చే నెలాఖరుకు ఏడాది కాలంలో మొత్తం లోటు రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి తగ్గిన రాబడిలోటును పూడ్చుకొనేందుకు,ఇతర ప్రభుత్వ కార్యక్ర మాలకు అప్పులు చేస్తుండటంతో ఇప్పుడు జులైనాటికి 1.12లక్షల కోట్ల డాలర్లు వడ్డీ, అసలుకు చెల్లించారు, ఏడాది మొత్తానికి 1.37లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. ఇది వైద్య, ఆరోగ్య సంరక్షణకు చేస్తున్నదానికంటే ఎక్కువ అంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారనున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఉరిమి ఉరిమి మంగలం మీద పడ్డట్లు అప్పుల భారం పెరిగితే స్వయంగా ఒక పెద్ద కార్పొరేట్ అధిపతి అయిన ట్రంప్ లేదా మరొకరు సామాన్యుల సంక్షేమానికి కోత పెట్టటం తప్ప ధనికుల జోలికిపోరు. జీడీపీకి సమంగా రుణ భారం పెరిగింది, రానున్న రోజుల్లో అదింకా పెరగటం తప్ప తగ్గేతీరు కనిపించటం లేదు.దీంతో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థకు తలెత్తే ముప్పు గురించి నిపుణలు చేస్తున్న హెచ్చరికలను ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. అనేక చోట్ల అనవసరంగా యుద్ధాలకు దిగుతూ, ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్నాడు.

దీంతో రక్షణ శాఖ ఖర్చు తడిచిమోపె డవుతున్నది. లోటును తగ్గించుకొనేం దుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువు లపై పన్ను విధించాలనే దివాలాకోరు చర్యలకు ఎదురు దెబ్బలు తగులుతున్నా అడ్డదా రులను వెతుకుతున్నాడు. ఇరాన్‌పై తప్పుడు సాకులతో యుద్ధానికి దిగిన ట్రంప్ ఎంత నష్టం కలిగించాడో చూస్తున్నాం. రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయి న్‌‌ను పావుగా దాని మీద ప్రయోగిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలకు అవుతున్న యుద్ధ ఖర్చులు ఎంతగా పెరుగుతున్నాయో తెలిసిందే.ఈ భారాలను భరించేందుకు కార్పొరేట్లు ఏమాత్రం అంగీకరించవు.
అప్పులు పెరిగితే వచ్చే అనర్దాలు ఒక రోజు వెనుకా ముందు తప్ప ప్రతి దేశానికి తప్పవు. ప్రభుత్వ అప్పులు పెరిగితే వనరులు తగ్గి ప్రయివేటు పెట్టుబడులకు కొరత పెరుగుతుంది, అది వడ్డీరేట్లు అధికం కావటానికి దారితీస్తుంది.పెట్టుబడి తగ్గి అది కార్మికుల ఉత్పాదకత మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది, వేతనాలు తగ్గుతాయి. అమెరికాలో ఈ పరిస్థితి కారణంగా 2025 నుంచి 2055 నాటికి కార్మికుల రాబడి వృద్ధి 16శాతం తగ్గుతుందని అంచనా. రానున్న పదేండ్లలో అసలు, వడ్డీ చెల్లింపులు 76శాతం పెరుగుతాయి. దాన్ని పూడ్చుకోవా లంటే సంక్షేమ పథకాలకు కోత పడుతుంది. గృహ, కార్లు, విద్యార్థి, క్రెడిట్ కార్డు, వాణిజ్య రుణ వడ్డీ రేట్లు మోత మోగు తాయి. ఇవన్నీ కూడా జనజీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేసేవే. ఇప్పుడు చేసే అప్పు రానున్న తరాల మీద భారం మోపుతుంది.

డోనాల్డ్ ట్రంప్ దివాలా కోరు విధానాల కారణంగా పెరుగుతున్న అప్పుల ముప్పు గురించి చెప్పుకున్న తరువాత అతగాడి జిగినీ దోస్తు నరేంద్రమోడీ ఘనత గురించి చెబితే తప్ప సంపూర్ణం కాదు. పదేండ్లలో అమెరికా అప్పు రెట్టింపైందని అక్కడి ఆర్థికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. తాను అధికారానికి వచ్చినపుడు రెండు లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న జీడీపీని నాలుగు లక్షల కోట్లకు పెంచి ప్రపంచంలో పద కొండు నుంచి ఐదవ స్థానానికి చేర్చినట్లు మోడీ గొప్పగా చెప్పుకుంటారు. కానీ అదే ఏలుబడిలో 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు 55 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు 200లక్షల కోట్లకు పెరిగింది. ఎప్పుడైనా, ఎక్కడైనా దేశాన్ని అప్పుల ఊబిలోకి ఏడాదికేడాది దించుతున్న ఈ “ఘనత” గురించి ప్రస్తావిం చారా? పన్నెడేండ్లలో అప్పుల చెల్లింపు 4.02లక్షల కోట్ల నుంచి 2026-27 బడ్జెట్‌లో 14.04లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్‌లో నాలుగోవంతు కాగా ప్రభుత్వ రాబడిలో నలభై శాతం. మోడీ దేశాన్ని ఎటు తీసుకుపోతున్నట్టు?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -