తెలంగాణ కంపెనీలకు భారీ ఆదాయాలు
బర్గండీ- హురున్ ఇండియా రిపోర్ట్
హైదరాబాద్ : భారత కార్పొరేట్ రంగంలో తెలంగాణ పారిశ్రామికవర్గాలు తమ ప్రత్యేక ముద్రను వేస్తు న్నాయి. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన బర్గండీ ప్రయివేటు, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘2025 బర్గండీ ప్రయివేటు హురున్ ఇండియా 500’ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలోని కంపెనీలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. గత ఐదేండ్ల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు ప్రతిరోజూ సగటున రూ. 283 కోట్ల విలువను తమ ఖాతాలో వేసుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2021లో ఈ జాబితా ప్రారంభమైనప్పుడు తెలంగాణ నుంచి 30 కంపెనీలు ఉండగా.. 2025 నాటికి ఆ సంఖ్య 39కి చేరిం ది. ఈ 39 కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తుండటం విశేషం.
అపారమైన విలువ.. : తెలంగాణ కంపెనీల మొత్తం విలువ ప్రస్తుతం రూ. 12.1 లక్షల కోట్లుగా ఉంది. 2021 నాటి 5.2 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 75 శాతం అధికం. అలాగే.. ఈ సంస్థల మొత్తం అమ్మకాలు 47 శాతం పెరిగి రూ. 2.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ సంస్థలు దాదాపు 3.4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 2021తో పోలిస్తే ఇది 70 శాతం పెరుగుదల. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల నియామకంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, మెడ్‌ప్లస్, రెయిన్ బో చిల్డ్రన్స్ మెడికేర్ ముందు వరుసలో ఉన్నాయి.
రంగాల వారీగా.. : తెలంగాణ నుంచి 16 హెల్త్‌కేర్ కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకుని హైదరా బాద్‌ను ఇండియా హెల్త్ క్యాపిటల్‌గా నిలబెట్టా యి. ఆ తర్వాత ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ (5), ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ (3), ఆటోమొబైల్ (3) రంగాలు ఉన్నాయి.
‘‘తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆర్థిక విస్తరణలో అద్భుతమైన వేగంతో దూసుకుపోతున్నాయని కొనియాడారు. దేశాభివృద్ధిలో ఈ కంపెనీలు వెన్నె ముకగా నిలుస్తున్నాయి.’ అని హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు.
కార్పొరేట్ రంగంలో మందగమనం : దేశం లోని టాప్ 500 ప్రయివేటు రంగ కంపెనీల మొత్తం విలువ 3.4 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.285 లక్షల కోట్లు) చేరుకుంది. బర్గండీ ప్రయివేటు హురున్ ఇండియా 500 నివేదిక వెల్లడించిన గణాంకాలు మాత్రం కార్పొరేట్ ఇండియాలో సవాళ్లను బయట పెట్టాయి. ఈ జాబితాలోని కంపెనీల్లో 40 శాతం కంటే తక్కువ సంస్థలు మాత్రమే గతేడాది కాలంలో తమ విలువను పెంచుకోగలిగాయి. ఇది దేశంలోని డిమాండ్ లేమి.. మందగమనాన్ని సూచిస్తోందని స్పష్టమవుతోంది. 500 కంపెనీలలో కేవలం 198 సంస్థలు మాత్రమే తమ విలువలో వృద్ధిని నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా ఐదో ఏడాది కూడా అత్యంత విలువైన ప్రయివేటు కంపెనీగా నిలిచింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో స్థానంలో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ టాప్ 10 కంపెనీల మొత్తం విలువ హురున్ 500 జాబితాలోని మొత్తం విలువలో 27 శాతాన్ని కలిగి ఉంది. మరోవైపు ఐటి రంగం ఈసారి అతిపెద్ద విలువ రంగంగా మారింది. గత ఐదేళ్లలో టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు కలిసి దాదాపు రూ.8.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు
– దివీస్ ల్యాబొరేటరీస్: రూ. 1,72,630 కోట్లు-
– డాక్టర్ రెడ్డీస్ : రూ. 1,10,420 కోట్లు
– ఎంఇఐఎల్ : రూ. 83,800 కోట్లు
– అరోబిందో ఫార్మా: రూ.80,710 కోట్లు
– గ్రీన్‌కో: రూ.71,100 కోట్లు
– లారస్ ల్యాబ్స్: రూ.59,440 కోట్లు
– ప్రీమియర్ ఎనర్జీస్: రూ.46,130 కోట్లు
– ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీస్: రూ.34,770 కోట్లు
– హెటెరో ల్యాబ్స్: రూ.33,850 కోట్లు
– కిమ్స్ : రూ.26,680 కోట్లు



