నవతెలంగాణ-హైదరాబాద్ : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో సైనిక న్యాయస్థానం అధిపతి, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో విమానం శకలాలు, మంటల్లో కాలిపోయిన అవశేషాలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఈ ఘటన శుక్రవారం జరగ్గా.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.






కామెంట్‌లు (0)