Magazines

స్వచ్ఛత.. పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం

47 నిమిషాల క్రితం

Cleanliness
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

రూ.1.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

స్వచ్ఛతా హి సేవాలో శ్రమదానం చేసిన మున్సిపల్ కమిషనర్ తుడి దీపక్‌రెడ్డి

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛతతో పాటు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా - 2026లో భాగంగా ‘ఏక్ దిన్–ఏక్ గంట–ఏక్ సాథ్’ శ్రమదాన్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ తుడి దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.గురువారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాలు, మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని పిలుపునిచ్చారు.


రూ.1.5 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులు

పట్టణ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో ప్రధాన వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కమిషనర్ తుడి దీపక్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 18వ వార్డు గెస్ట్‌హౌస్‌ ఏరియాలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడం, వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రోడ్లను నిర్మించడమే లక్ష్యమన్నారు. పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్ జాన్, 18 వ వార్డు కౌన్సిలర్ తిరుమలశెట్టి వెంకన్నబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్