నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పురపాలక సంఘం పరిధిలోని చిన్నంశెట్టి బజార్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బెల్టుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కౌన్సిలర్ సింధుజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలలోని 22 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బెల్టులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి, సౌకర్యాలు అందించడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసనపై ఆసక్తి పెంపొందించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వి. బాబురావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)