Magazines

అశ్వారావుపేట మున్సిపల్ కౌన్సిల్‌లో కీలక తీర్మానాలకు ఆమోదం

45 నిమిషాల క్రితం

municipal
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం


- వీధి కుక్కల నియంత్రణ కేంద్రం ఏర్పాటు.. 

- తాగునీటి మోటార్ల కొనుగోలు.. 

- పారిశుద్ధ్య పనులపై నిర్ణయాలు

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశంలో పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సేవలు అందించడంతో పాటు పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు.


సమావేశంలో అశ్వారావుపేట పరిధిలో వీధి కుక్కల నియంత్రణ, చికిత్స కోసం ఏబీసీ (ఏనిమల్ బర్త్ కంట్రోల్ - జంతు జనన నియంత్రణ) కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరా కోసం ఏడు మోటార్ల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. మట్టి వినాయక విగ్రహాల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు, మెజర్‌మెంట్ బుక్స్ కొనుగోలు, కోతులు, వీధి జంతువుల నియంత్రణ చర్యలు, జేసీబీలతో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం, బ్లీచింగ్ పౌడర్, సున్నం కొనుగోలు వంటి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.


అదేవిధంగా ఈ - ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ప్రకటనలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు, మున్సిపల్ కార్యాలయ ఇంటర్నెట్ చార్జీలు, అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుర్రాలచెరువు గ్రామపంచాయతీలు ప్రొఫార్మా-8 ద్వారా చెల్లించాల్సిన బిల్లులతో పాటు ఇతర పరిపాలనా అంశాలను కూడా కౌన్సిల్ ఆమోదించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి పట్టణ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్ తూడి దిలీప్‌రెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్ వేముల సురేష్, టౌన్ ప్లానింగ్ అధికారి ఎ. వంశీకృష్ణ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్