- అధిక లాభాల పేరుతో పెట్టుబడులంటూ ప్రచారం.. బాధితుల మధ్య చర్చలు?
- చిట్టీలు, యాప్‌ల వ్యవహారంపై స్థానికంగా గుసగుసలు.. ఫిర్యాదు అందలేదన్న పోలీసులు
నవతెలంగాణ - ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో యాప్‌లలో డబ్బులు పెట్టుబడిగా పెడితే అధిక లాభాలు వస్తాయని కొందరికి చెప్పినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టినట్లు చెబుతున్న కొందరు వ్యక్తులు ఒకచోట సమావేశమై తమ మధ్య జరిగిన లావాదేవీలపై చర్చించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇటీవల అచ్చంపేటలో చోటుచేసుకున్న ఆర్థిక వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఉప్పునుంతల మండలంలోనూ ఇలాంటి వ్యవహారంపై గుసగుసలు వినిపించడం ఆసక్తికరంగా మారింది. చిట్టీలు, యాప్‌ల ద్వారా కొందరి నుంచి డబ్బులు సేకరించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు.
ఈ వ్యవహారానికి సంబంధించి స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఆ వ్యక్తి పాత్ర ఏమిటనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కేవలం స్థానికంగా జరుగుతున్న చర్చల ఆధారంగా ఎలాంటి నిర్ధారణకు రావడం సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)