Magazines

సత్తుపల్లి మండలంలో 'స్మార్ట్ రేషన్ కార్డులు'  పంపిణీ

1 గంట క్రితం

mla
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది 

- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ 

నవతెలంగాణ-సత్తుపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మండలంలోని రామగోవిందాపురం, రేజర్ల గ్రామాల్లో శనివారం పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని తెలిపారు. ​గ్రామాల్లో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతుండటంతో  ముఖ్యంగా మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోందన్నారు. 

​సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, తహసీల్దారు ​పున్నం సత్యనారాయణ, ఎంపీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావు, రేజర్ల గ్రామ సర్పంచ్ 

​భీమిరెడ్డి అరుణ, రామగోవిందాపురం గ్రామ సర్పంచ్ మౌనిక నరేంద్ర రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ​భీమిరెడ్డి సుబ్బారెడ్డి, ​ఆయా గ్రామాల ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ​కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్