Magazines

యువ మోర్చా మండలాధ్యక్ష‍ుడికి ఘన సన్మానం 

1 గంట క్రితం

BJP
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

బిజెపి మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ 

నవతెలంగాణ-నెల్లికుదురు 

 భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నెల్లికుదురు మండల అధ్యక్షునిగా నియమితులైన పెరుమాండ్ల శివ సాయిని మండల కేంద్రంలో శనివారం బీజేపీ మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చీకటి మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేస్తూ, పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేయడానికి శివ సాయి కృషి చేయాలని ఆకాంక్షించారు.


యువ మోర్చా ఆధ్వర్యంలో యువత సమస్యలపై చురుకుగా పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.యువ మోర్చా మండల అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పెరుమాండ్ల శివ సాయి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, యువతను పార్టీతో అనుసంధానం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నెల్లికుదురు మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్, యాకిరెడ్డి, సురేష్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్