నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో జరుగుతున్న సిద్దిపేట జిల్లా జూనియర్ కబడ్డీ టీం శిక్షణ శిభిరాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం సహాయ కార్యదర్శి కుంటానోళ్ల శివకుమార్, సిద్ధిపేట జిల్లా గ్రంధాలయ మాజీ ఛైర్మెన్ కేడం లింగమూర్తి సందర్శించారు. క్రీడాకారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటలలో దృఢత్వం సాధిస్తే జీవితంలో వచ్చే ప్రతి సమస్యను దైర్యంగా ఎదుర్కొవలన్నారు.
జీవితంలో పై స్థాయి కి చేరుకోవడానికి, స్థిరపడానికి కబడ్డీ అట చాలా చక్కగా సహకరిస్తుందన్నారు. అనడానికి ప్రో కబడ్డీ కానీ తెలంగాణ ప్రో కబడ్డీ నిదర్శనం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గద్దల రమేష్,సహాయ కార్యదర్శులు నరేందర్, కరుణాకర్, కోశాధికారి సత్యం, కార్యవర్గ సభ్యులు చందు, పవన్,హుస్నాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెన్న రాజు,కోచ్ మడక కృష్ణ,సీనియర్ క్రీడాకారులు డ్యాగాల సారయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)