Magazines

సరికొత్త లవ్‌ స్టోరీ

44 నిమిషాల క్రితం

A brand-new love story
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

హై జాయ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, వింటేస్‌ ఐకానిక్‌ పిక్చర్స్‌ నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వం వహించిన సినిమా ‘చకోర’(లూనర్‌ లవ్‌ బర్డ్‌). శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ను ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌కు హీరో ఆకాష్ జగన్నాథ్ అతిథిగా విచ్చేసి, ట్రైలర్ను రిలీజ్ చేశారు. డైరెక్టర్ మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘వీలైనంత తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీలో రూపొందించాను. ఇండస్ట్రీ, మీడియాలోని ఫ్రెండ్స్ సినిమా చూసి, బ్యూటి ఫుల్ మూవీ చేశావని ప్రశంసించారు. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. ‘ఒక మంచి ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ చూడాలనుకుంటే మీరు మా సినిమాకు రావొచ్చు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకు, తల్లీ కొడుకు, స్నేహితుల మధ్య, ప్రేమ జంట మధ్య ఉండే లవ్ మీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని హీరో శ్రవణ్ చెప్పారు. ప్రొడ్యూసర్ డా. చింతాడ హేమారావు మాట్లాడుతూ, ‘చిత్ర పరిశ్రమలో మాకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు స్ఫూర్తినిస్తారు. వారి ఇన్సిపిరేషన్ తో కొత్త వాళ్లకు అవకాశం కల్పిం చాలని ప్రొడక్షన్ లోకి వచ్చాం. ఈ చిత్రంలో మీరు ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని ఒక కొత్త తరహా ప్రేమ కథను చూస్తారు. ఈ లవ్ స్టోరీ మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్