నవతెలంగాణ - భీంగల్
భీంగల్ మండలంలోని కారేపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా మూడవత్ ఆకాష్ ను శనివారం నియమించారు. నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆకాష్ ను గ్రామ శాఖ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన గ్రామ శాఖ అధ్యక్షుడు మూడవత్ ఆకాష్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ గ్రామంలో సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గుర్తింపు పొందానన్నారు.
తనపై నమ్మకం, విశ్వాసంతో గ్రామ శాఖ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామస్తులకు, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామస్తులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా నియమించినందుకు సునీల్ కుమార్, నాగేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





కామెంట్‌లు (0)